తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాము అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు...

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు(Polavaram-Nallamalasagar Link Project)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు(Suprme Court)లో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ అభ్యంతరంపై ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) స్పందించారు. నల్లమల సాగర్‌తో ఏ రాష్ట్రానికీ నష్టముండదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు కట్టిందని, ఆ సమయంలో తాము అడ్డుచెప్పలేదని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదుల నీటిని తెలంగాణ వాడుకున్న తర్వాతే తమ రాష్ట్రం వాడుకుంటుందని తెలిపారు. పోలంవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 87 శాతం పూర్తి అయ్యాయన్నారు. సముద్రంలో కలిసే కొంత నీటిని వాడుకుంటామని చెబుతున్నామని, పోలవరం పూర్తి అయితే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు తెలిపారు.

Next Story