తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-08 06:37:49  IST  )

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ కు ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. రేవంతన్నకు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు.. మీ నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా, ప్రతి ఇంటా వెలుగులు నింపి, తెలంగాణను సుభిక్షం వైపు నడిపించే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Next Story