Cm Chandrababu: కేంద్రమంత్రికి కీలక విజ్ఞప్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-24 08:05:17  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు..

Cm Chandrababu: కేంద్రమంత్రికి కీలక విజ్ఞప్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్(Union Budget) నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Sitaraman)తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కాగా దావోస్(Davos) పర్యటన ముగించుకుని నేరుగా చంద్రబాబు ఢిల్లీ(Delhi)కి వెళ్లారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపైనా ఆమెకు వివరించారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల విషయాన్ని ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో సమావేశం తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింథ్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం తర్వాత కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషీలను చంద్రబాబు కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story