- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి ఫ్రీ కరెంట్.. మరో రెండు రోజుల్లో అమలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. తాము అధికారంలోకి వస్తే చేనేతలకు ఉచిత కరెంట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా కసరత్తులు చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చేనేత మగ్గాలకు 200, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశంపై అధికారులతో పలుమార్లు చర్చించారు. విద్యుత్ శాఖతో పలు అధికారులు, మంత్రులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ హామీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. హ్యాండ్ లూమ్ వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని తాజాగా జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది నేతన్నలు ఉన్నారని, వారందరికీ త్రిఫ్ట్ ఫండ్ కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్‌ను జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.






