పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో భేటీ అయ్యారు.

పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమకు రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరారు. వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

రాజ్యసభ స్థానాలతో పాటు, ఇటీవల ముగిసిన పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 'మహానాడు' తదుపరి కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మరియు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలపై అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు చర్చించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, కూటమి నేతలతో చర్చించిన తర్వాతే రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు ఆశావహులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story