Chandrababu Naidu : ఉగ్రదాడి నేపథ్యం.. కేంద్రానికి పూర్తి మద్ధతు : చంద్రబాబు

by Muthe.Rajitha |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో సమావేశం అయ్యారు.

Chandrababu Naidu : ఉగ్రదాడి నేపథ్యం.. కేంద్రానికి పూర్తి మద్ధతు : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మే 2న అమరావతి(Amaravathi) పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు రావలసిందిగా మోడీని ఆహ్వానించారు. అమరావతి పునఃప్రారంభ పనుల్లో భాగంగా లక్ష కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేయాలని చంద్రబాబు మోడీని కోరినట్టు తెలుస్తోంది.

అదేవిధంగా ఏపీకి సంబధించిన వివిధ అంశాలపై మోడీ, చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. కాగా మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు పీఎం మోడీ హాజరవనున్న నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. శంకుస్థాపన అనంతరం నిర్వహింహచే భారీ బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Next Story