ఏపీ : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

by Thanuru Gopichand |

ఏపీలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.

ఏపీ : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతి (Tirupati) , తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచింగ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఒక్క రోజు వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో మహిళలు ఉలిక్కి పడుతున్నారు. తమ మెడలోని బంగారానికి (Gold) భద్రతను కల్పించడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి టీచర్స్ కాలనీలో దారుణం జరిగింది. పట్ట పగలే ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డారు. టీచర్స్ కాలనీలోని ఓ నివాసంలోకి చొరబడ్డ దుండగుడు నివాసంలోని మహిళ కళ్లలో కారం కొట్టాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తిలో భర్తతో కలిసి బైకుపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగుడు చైన్ లాక్కొని పారిపోయాడు. పందలపాకకు చెందిన వడ్లపూడి వీరరాఘవ తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్వారంపూడి రైల్వే స్టేషనుకు (Dwarampudi Railway Station) బైకు పై బయలుదేరాడు. వారు బైకుపై అనపర్తి శివారులోని కొప్పవరం రోడ్డుకు చేరుకున్న సమయంలో ఓ దుండగుడు వారి వైపు బైకుపై వచ్చాడు. బైకు వెనక వైపు కూర్చున్న విజయలక్ష్మి మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ క్రమంలో బైకు అదుపు తప్పి భార్యాభర్త ఇద్దరూ బోది కాలువలో పడిపోయారు. వారు తేరుకునేలోపు దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

Next Story