అమరావతి ఐకాన్‌కు కొత్త రూపు.. పనులు షురూ

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతి ఐకాన్‌ ధ్యాన బుద్ధ విగ్రహానికి కొత్త రూపు తీసుకొస్తున్నారు...

అమరావతి ఐకాన్‌కు కొత్త రూపు.. పనులు షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ఐకాన్‌గా ఉన్న 125 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహానికి(Meditating Buddha statue) కొత్త రూపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహానికి మరమ్మతు పనులను తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే విగ్రహం ఆధునీకరణకు రూ.1.85 కోట్లు మంజూరు చేసింది. దీంతో పర్యటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు.

వర్షంతో బుద్ధుడి విగ్రహానికి రంధ్రాలు

కాగా బుద్ధుడి విగ్రహానికి రంధ్రాలు పడ్డాయి.ఈ రంద్రాల ద్వారా వర్షపు నీరు విగ్రహం లోపలికి చేరుతున్నాయి. దీంతో విగ్రహంపై చారలు ఏర్పడి. పెచ్చులు ఊడిపోయాయి. విగ్రహం లోపల ఉన్న వీడియో దర్శిని పూర్తి పాడైపోయింది. దీంతో సందర్శనకు వచ్చిన పర్యటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, పర్యటక శాఖ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీసుకెళ్లారు. లేఖ ద్వారా బుద్ధుడి విగ్రహం దుస్థితిని వివరించారు. దీంతో ప్రభుత్వం స్పందించి ధ్యాన బుద్ధ ప్రాజెక్టు ఆధునీకరణను నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం బుద్ధుడి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా రంగులతో తీర్చి దిద్దుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి చిహ్నంగా ఈ ధ్యానబుద్ధ ప్రాజెక్టు త్వరలో కొత్తరూపుతో దర్శనం ఇవ్వనుంది.

Next Story