AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఆ అంశాలపైనే చర్చించే చాన్స్!

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఆ అంశాలపైనే చర్చించే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే నివేదికను సిద్ధం చేసింది. ఆ రిపోర్టులోని అంశాలు, కల్తీకి బాధ్యులైన వారిపై తీసుకోవాల్సిన చర్యల, సిట్ చేసిన సిఫార్సులపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. అదేవిధంగా ఈనెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది.

ఇక అమరావతి (Amaravati)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ‘AI లివింగ్ ల్యాబ్స్’ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించే అంశం కూడా అజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘సూపర్ సిక్స్’ హామీల అమలు, నిధుల సర్దుబాటు, ఇతర అభివృద్ధి పనులపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీ కాస్త ప్రధాన్యత నెలకొంది.

Next Story