ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. "స్త్రీశక్తి"పై చర్చ

by Naga Rani Yarlagadda |

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ (AP Cabinet Sub Committee) సమావేశమయింది.

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. స్త్రీశక్తిపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ (AP Cabinet Sub Committee) సమావేశమయింది. ఈ సమావేశానికి మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి హాజరయ్యారు. ఆగస్టు 15న రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభం కానున్న మహిళలకు ఉచితబస్సు పథకం పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. స్త్రీ శక్తి (Stree Shakti) పేరుతో ప్రారంభించనున్న ఉచిత బస్సు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశంలో స్త్రీ శక్తి పథకానికి ఆమోదం లభించనుంది. దీంతో.. మరో 10 రోజుల్లో రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు పథకం అందుబాటులోకి రానుంది.

Next Story