- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం.. కేంద్రానికి 28 జిల్లాల ప్రతిపాదన?
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాగా.. పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ ఆర్డర్ గెజిట్ ప్రతిపాదనపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ ఆర్డర్ 2025, ప్రతిపాదన ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీజోన్లు అమల్లోకి రానున్నాయి. తదుపరి ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు దీనిని ప్రామాణికంగా తీసుకునే చాన్స్ ఉంది. మంత్రివర్గం ఆమోదించి, గెజిట్ విడుదలైతే ఏపీలో 26 జిల్లాలు ప్రామాణికం కానున్నాయి.
28 జిల్లాల ప్రతిపాదన
26 జిల్లాల తర్వాత.. కూటమి ప్రభుత్వం కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో.. కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి మరో కొత్త ప్రతిపాదనను కూడా పంపనుంది. 28 జిల్లాల గెజిట్.. ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపట్టే విధంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ భేటీలో రూ.39 వేలకోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో సంస్థల ఏర్పాటు, భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై కూడా కేంద్రం, రాష్ట్రపతికి మంత్రివర్గం ధన్యవాదాలు తెలుపనుంది.






