- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ జగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ జగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ విజయానందర్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి గాను 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలుపనున్నారు. నాలుగు అంతర్జాతీయ కన్వేషన్ సెంటర్ల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రాజధానిలో పలు సంస్థల భూకేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై సమగ్రంగా చర్చించనున్నారు. గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కూడా చర్చించనున్నారు. సుపరిపాలన, తొలి అడుగు ఫీడ్‌బ్యాక్ అంశం చర్చకు రానుంది. కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది.






