కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. రాష్ట్రంలో మరో 10 కొత్త మెడికల్ కాలేజీలు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-04 04:48:09  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ జరగనుంది.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. రాష్ట్రంలో మరో 10 కొత్త మెడికల్ కాలేజీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 30 అంశాలను అజెండాలో చేర్చారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల సబ్ క్లాసిఫికేషన్ బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్రంలో మరో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నష్ట పరిహారం కింద రూ.571 కోట్ల నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అమరావతిలో విద్య, వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పలు పారిశ్రమలకు SIPB ఆమోదం ఇవ్వనున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ, ట్రాన్స్‌పోర్టు వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఓకే చెప్పనున్నారు. అనధికార భవనాల లీగలైజేషన్‌కు మరో కొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.

Next Story