- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. మరో తేదీ ఫిక్స్
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(Ap Cabinet) భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 19న వెలగపూడి సచివాలయం(Velagapudi Secretariat)లో మంత్రివర్గం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే 21న విశాఖ(Visakhapatnam)లో ‘యోగా డే’(Yoga Day) ఉండటం, ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ(Prime Minister Modi) ఏపీ పర్యటన నేపథ్యం వంటి కారణాలతో ఈ భేటీని వాయిదా వేశారు. ఈ నెల 24న కేబినెట్ భేటీ జరుగుతుందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి నెలలో రెండు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న పథకాలు, సాధ్యాసాధ్యాలు, ఆర్థిక పరిస్థితి, తాజా పరిస్థితులు వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ఈ నెల 19న భేటీ కావాలని తొలుత నిర్ణయించారు. తాజాగా ఈ భేటీని 24కు వాయిదా వేశారు.






