AP Cabinet meeting:ఆ రోజే కేబినెట్ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఈ నెల(ఏప్రిల్) 15వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరగనుంది.

AP Cabinet meeting:ఆ రోజే కేబినెట్ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఈ నెల(ఏప్రిల్) 15వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరగనుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరగబోయే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు పంపాలని సీఎస్ విజయానంద్(CS Vijayanandh) ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో మెగా డీఎస్సీ(Mega DSC)తో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రేపు(ఏప్రిల్ 11) సీఎం చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆగిరిపల్లిలో పూలే జయంతి ఉత్సవాలకు హాజరుకానున్నారు.

Next Story