- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ( Ap Cabinet) సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ( Ap Cabinet) సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ( Cm chandrababu) అధ్యక్షతన.. అమరావతిలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా... పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంది. మే 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో.. ఈ నెల 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రతిపాదనలు అలాగే కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఏపీ సిఎస్ విజయానంద్ కు కీలక ఆదేశాలు వెళ్లాయి.
వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని ఆదేశాలు వచ్చాయి. ఇక ఏపీ కేబినెట్ సమావేశంలో.... కూటమి ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ పథకాలపై చర్చ జరగనుంది. అలాగే అమరావతి పనులపై కూడా ఈ సందర్భంగా చర్చ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు అంశంపై కూడా చర్చించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమలుపై.. నివేదిక ఇప్పటికే తయారు చేసినట్లు సమాచారం అందుతుంది. అలాగే వచ్చే వర్షాకాలంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులపై కూడా చర్చించనున్నారు.






