సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-10 06:48:28  IST  )

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం (Cabinet meeting) అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 69 అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం కలిసి మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు, ప్రణాళికలు, ఆహ్వానితుల జాబితా వంటి అంశాలపై ప్రస్తుతం చర్చ జరగనుంది. అలాగే ఇటీవల జరిగిన 12వ SIPB సమావేశంలో ఆమోదించిన రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు తుది ఆమోదం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, మొంథా తుఫాన్ ప్రభావం, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నష్టం అంచనాలు, కేంద్ర బృందం పర్యటన వివరాలు కూడా ఈ కేబినెట్ అజెండాలో ఉన్నాయి. అదనంగా, NaBFID నుంచి రూ. 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించనుంది. ఇదే కాకుండా, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ, అలాగే పాలనాపరమైన సవరణలపై కూడా ముఖ్య చర్చ జరగనుంది. మొత్తం మీద, రాష్ట్ర భవిష్యత్ పెట్టుబడులు, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ అంశాల్లో ఏపీ కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Next Story