ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

by Thanuru Gopichand |

వివిధ ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్న అధికార వర్గాలు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం అయ్యింది. అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో (Velagapudi Secreteriat) కీలక సమావేశం జరుగుతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో సుమారు 35కు పైగా కీలక అంశాలపై అజెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, కొత్త పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలకు భూకేటాయింపులు, పాలనాపరమైన సంస్కరణలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవలి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల అమలుపై కూడా మంత్రివర్గం చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న దిల్లీ పర్యటన కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఈ నిర్ణయాలు ఏపీ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంలో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Next Story