- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Cabinet: 20 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్
20 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన అమరావతి (Amaravati) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో 20 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులకు భూములు కేటాయింపుతో పాటు ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కేబినెట్ గ్రీన్ ఇచ్చింది. అధికార భాషా కమిషన్ పేరు మర్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. వ్యవసాయ భూమిని, వ్యవసాయేరంగా మార్చేందుకు ఆమోద ముద్ర వేశారు. అలా నాలా చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు. అమరావతిలో రూ. 904 కోట్లతో 29 గ్రామాలకు అభివృద్ధి చేసేందుకు మంత్రులు పచ్చజెండా ఊపారు. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరిన్ని అజెండా అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపారు.
Read More: Government: గుడ్ న్యూస్ .. వారికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు.. అర్హతలు ఇవే!?






