మార్కాపురం ప్రమాదంపై ఏపీ కేబినెట్​ సంతాపం

by Vemula.Srinu Prasad |

మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 13 సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ...

మార్కాపురం ప్రమాదంపై  ఏపీ కేబినెట్​ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 13 సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మంత్రులు, అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ఇలాంటి ఘటనలు పునరావృతం చూడాలని ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ, పోలీసు, ఆరోగ్య శాఖలకు ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story