- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం.. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు అమరావతిలో జరిగి ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన అమరావతి వేదికగా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet meeting) జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో కలిసి సీఎం చర్చించారు. అనంతరం కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో యూనివర్సల్ హెల్త్ పాలసీ (Universal Health Policy)కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా (Health insurance for all citizens) కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ -ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (NTR Medical Service Scheme) కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపారు. ఇందులో ఏడాది ఒక్కో కుటుంబానికి పాతిక లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన కోటి 63 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 6 గంటల్లోనే వైద్య చికిత్స అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ (Pre-authorization management) ఏర్పాటు చేయనున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్ కు అవకాశం ఇచ్చారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు అయ్యే వ్యయాన్ని మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.






