AP Budget: రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!

by velandi.Saikiran |

ఏపీ బడ్జెట్ ఇవాళ అసెంబ్లీలో పెట్ట‌నున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పై పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

AP Budget: రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశపెట్టానుంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పై పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.2026-27 FY కి సంబంధించిన ఈ బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

సూపర్ సిక్స్ హామీలే టార్గెట్..రూ.3.32 లక్షల కోట్లతో బ‌డ్జెట్‌

ఈ సందర్భంగా ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలు, రోడ్ల అభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగ విస్తరణకు నిధులు ఎక్కువ స్థాయిలో కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం... వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకు వస్తారు. హోం మంత్రి అనిత శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. ఫిబ్రవరి 17, 18 తేదీలలో బడ్జెట్ పై చర్చించి అనంతరం ఆమోదం తెలుపుతుంది అసెంబ్లీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల‌కు వైసీపీ పార్టీ దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Next Story