- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపు సంక్షేమ భవనానికి సహకరించండి.. సీఎస్ శాంతికుమారికి బీఆర్ఎస్ ఏపీ ప్రెసిడెంట్ వినతి
by Javid Pasha |
హైదారాబాద్ లో నిర్మించ తలపెట్టిన కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారమందేలా తోడ్పాటునందించాలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ కోరారు.

X
దిశ, ఏపీ బ్యూరో: హైదారాబాద్ లో నిర్మించ తలపెట్టిన కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారమందేలా తోడ్పాటునందించాలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 25న ఇదే అంశంపై సీఎం కేసిఆర్ ను తోట చంద్రశేఖర్ నేతృత్వంలో విశ్రాంత అఖిల భారత సర్వీస్ అధికారుల బృందం రాజకీయాలకతీతంగా కలసిన సంగతి విదితమే.
కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి సీఎం సానుకూలంగా స్పందించి భవన నిర్మాణానికి అవసరమైన నిధులు, స్థల కేటాయింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎస్ శాంతికుమారి కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం తరఫున త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ తోట తెలిపారు.
Next Story






