AP Breaking: 'కూటమి అభ్యర్థి ఎంపిక'పై ఉత్కంఠ !

by Geesa Chandu |

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సే ఉపఎన్నికలో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు.

AP Breaking: కూటమి అభ్యర్థి ఎంపికపై  ఉత్కంఠ !
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సే ఉపఎన్నికలో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో "గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస రావులు మరియు జనసేన నుంచి పంచకర్ల రమేష్, భాజపా నుంచి విష్ణు కుమార్ రాజు లను కమిటీ సభ్యులు" గా నియమించారు. అర్బన్ మరియు రూరల్ కు సంబంధించి ఎన్ని ఓట్లున్నాయనే అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీని చంద్రబాబు ఆదేశించారు.ఎన్నికల ఫలితాల తర్వాత.. చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇప్పటికే కూటమికి మద్దతు తెలిపారని, అయితే కొంత మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని అధినేత దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. ఆ వ్యక్తిని తప్పక గెలిపించుకొస్తామని, అయితే తుది నిర్ణయాధికారం మాత్రం పార్టీ అధినేతనే తీసుకుంటారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయి స్థితిగతులను బేరీజు వేస్తూ.. తనకు నివేదించాలని సభ్యులకు చంద్రబాబు సూచించారు.

Next Story