- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ దెబ్బ అదుర్స్.. ఏపీ డీజీపీతో సహా ఎస్పీలు అవుట్!
by Kema Shiva Kumar |
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆ పార్టీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దింపేందుకు పథకాలను రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో పోలీసు శాఖ నుంచి ఆ పార్టీకి ఏ మాత్రం సహకారం లేకుండా చేసేందుకు పక్కాగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్పీ ఆనంద్ రెడ్డి అలా మొత్తం 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నిక విధుల నుంచి తప్పించాలంటూ ఆమె ఎలక్షన్ కమీషన్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే డీజీపీపై, ఇతర అధికారులపై వేటు వేసేందుకు ఈసీ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






