- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్.. ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్
‘రైలు వచ్చిందంటే.. అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి అభివృద్ధి వచ్చినట్లే’ అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (BJP) పేర్కొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రైలు వచ్చిందంటే.. అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి అభివృద్ధి వచ్చినట్లే’ అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (BJP) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా పట్టాలెక్కుతోందని పార్టీ స్పష్టం చేసింది. ఏపీ బీజేపీ తన ట్వీట్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక గణాంకాలను వెల్లడించింది.మొత్తం పొడవు 09 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం సాగుతోందని తెలిపింది. ఇప్పటికే 88.65 కిలోమీటర్ల మేర పనులు విజయవంతంగా పూర్తైనట్లు స్పష్టం చేసింది.
లబ్ధి పొందే ప్రాంతాలు..
ఈ కొత్త లైన్ వల్ల దర్సి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రాపూరు వంటి ముఖ్య పట్టణాలు ఇప్పుడు గర్వంగా భారత రైల్వే మ్యాప్‌లో చోటు సంపాదించుకున్నాయని తెలిపింది. ఎన్నో దశాబ్దాల కల, మరెన్నో గ్రామాల ఆశలు ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నాయని ఏపీ బీజేపీ పేర్కొంది. ‘ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పట్టాలు వేసింది కేవలం రైలు కోసమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల బంగారు భవిష్యత్తు కోసం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన తాజా ఫోటోలను కూడా పంచుకుంది. వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ రైల్వే లైన్ పూర్తయితే, రాయలసీమ, కోస్తా ఆంధ్ర మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, స్థానికంగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






