త్వరలో చాలా సంచలనాలు జరగబోతున్నాయి: విజయసాయి ట్వీట్‌పై స్పందించిన మాధవ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-19 10:59:03  IST  )

రాష్ట్రంలో త్వరలో చాలా సంచలనాలు జరగబోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

త్వరలో చాలా సంచలనాలు జరగబోతున్నాయి: విజయసాయి ట్వీట్‌పై స్పందించిన మాధవ్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) కోటరీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp Vijayasai Reddy) ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌(Bjp Chief Madhav) స్పందించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన త్వరలో రాష్ట్రంలో అనేక సంచలనాలు జరగబోతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో లిక్కర్ అవినీతి మాత్రమే కాదని.. చాలా అరచకాలు కూడా జరిగాయని, వాటన్నింటిపై శిక్ష తప్పదని, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని మాధవ్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఏం జరగబోతోందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటికే లిక్కర్ కేసులో చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తాజాగా మాధవ్ పేల్చిన బాంబుతో ఈసారి పెద్ద తలకాయేనా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. చూడాలి త్వరలో ఏం జరగబోతోందో.

Next Story