- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ విధ్వంసం.. రూ.26వేల కోట్ల అప్పులు తీర్చాం : విజయ్ కుమార్
రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక పనులను చక్కబెట్టామన్నారు బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక పనులను చక్కబెట్టామన్నారు బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. శనివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన రూ.26 వేల కోట్ల అప్పుల్ని తీర్చామని తెలిపారు. విద్యా ఫీజు, ధాన్యం రైతులకు బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే పింఛన్లు కూడా పెంచామని, ఎన్నికల హామీల్లో ఒకటైన తల్లికి వందనం కూడా సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నామని వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ధరల్ని తగ్గించినా.. ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ కు వచ్చిన ఆదాయం ఖజానాలోకి చేరకుండా బయటకు వెళ్లిందని, అందుకే అప్పులే మిగిలాయని విజయ్ కుమార్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎవరెవరుఉన్నారో సిట్ త్వరలోనే తేలుస్తుందని, దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.






