- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో కొనసాగుతోన్న 48 గంటల నిరవధిక బంద్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District)లోని ఏజెన్సీతో పాటు మరికొన్ని గిరిజన తెగలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 48 గంటల నిరవధిక బంద్ (Indefinite Bandh) ప్రారంభమైంది. ఈ బంద్‌కు పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayanna Pathrudu) ఇటీవల కామెంట్ చేశారు. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి ఆయన అన్నారు. ఒకవేళ అదే జరిగితే.. ‘వన్ ఆఫ్ సెవెంటీ’ (One of Seventy) చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, అయన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వెంటనే ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు, అఖిలపక్ష ప్రజా సంఘాలు అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District) ఏజెన్సీలో బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఇవాళ, రేపు ఆ జిల్లాలలో బంద్ కొనసాగనుంది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా తన మద్దతును ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి బంద్ ప్రకటించిన ప్రాంతాల్లో కొంతమంది తమ షాపులను స్వచ్ఛదంగా మూసివేశారు. జిల్లా కేంద్రం పాడేరు (Paderu)లోని ప్రధాన రహదారుల్లో నడుస్తున్న వాహనాలను సైతం గిరిజన సంఘాల నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు బంద్ నేపథ్యంలో అక్కడి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం వాయిదా వేశారు.






