AP: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల

by Kema Shiva Kumar |

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

AP: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20 వరకు మొత్తం 1,535 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్ పరీక్షలకు బోర్డు ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక జనరల్‌ పరీక్షలు మార్చి 15తో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి కొనసాగుతోన్న ప్రాక్టికల్‌ పరీక్షలు (Practical Exams) నేటితో ముగియనున్నాయి. అయితే, దేశంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ‘మన మిత్ర’ పేరుతో వాట్సాప్‌ గవర్నెన్స్‌‌కు (WhatsApp Governance) ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు (AP Intermediate Exams) సంబంధించి వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు (AP Inter Hall Ticket 2025) అందించనుంది. నేటి నుంచి వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. అందులో ఫస్ట్ ఇయర్ జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో జనరల్‌ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్‌టికెట్లు పంపిణీకి ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

Next Story