AP: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 21న జరగాల్సిన పరీక్ష 25కు రీషెడ్యూల్

by Kema Shiva Kumar |

ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చి 21న జరగాల్సిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్ష వాయిదా పడింది.

AP: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 21న జరగాల్సిన పరీక్ష 25కు రీషెడ్యూల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21న జరగాల్సిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష వాయిదా పడింది. రంజాన్ (Ramadan) పండుగ సెలవు తేదీలో మార్పు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 పరీక్షను తిరిగి మార్చి 25న అంటే బుధవారం నిర్వహించనున్నారు. అయితే, మార్చి 20న రంజాన్ సెలవుగా ప్రకటించగా.. నెలవంక దర్శనం ఆధారంగా పండుగ 21న వస్తుందని వక్ఫ్ బోర్డు తెలపడంతో ప్రభుత్వం శనివారం సాధారణ సెలవుగా ప్రకటించింది. దీంతో పరీక్షా తేదీ మార్పుపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేవలం 21న జరగాల్సిన పరీక్ష మాత్రమే వాయిదా పడిందని, మిగిలిన పరీక్షలన్నీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.

Next Story