- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్ఫ్‌లో చిక్కుకున్న 400 మంది తెలుగువాళ్లు.. త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు
గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చే ప్రక్రియను ఏపీ భవన్ అధికారులు వేగవంతం చేశారు. బహ్రెయిన్‌లో ఉన్నవారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గల్ఫ్(Gulf)పై ఇరాన్(Iran) చేస్తున్న దాడితో అక్కడున్న తెలుగు వాళ్లు(Telugu people) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. తమను త్వరగా స్వగ్రామాలకు చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు(AP Bhavan officials) స్పందించారు. గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. బహ్రెయిన్‌లో ఉన్నవారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు నడిపేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో మాట్లాడుతున్నారు.. బహ్రెయిన్ నుంచి ఇంకా 400 మంది రావాల్సి ఉండటంతో ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ, డీజీసీఏ, ఎంబసీ సాయం తీసుకుంటున్నారు. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు మూసివేత వల్ల తెలుగు వాళ్లను సౌదీకి తరలిస్తున్నారు. సౌదీలోని దమామ్ విమానాశ్రయం నుంచి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహ్రెయిన్ నుంచి మూడ్రోజుల్లో 300 మందిని ఇప్పటికే తీసుకొచ్చారు. మిగిలిన 400 మంది తెలుగువారిని కూడా తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారుల చర్యలు చేపట్టారు.






