వాళ్లు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు.. కారణం డబ్బు: అయ్యన్నపాత్రుడు

by Gantepaka Srikanth |

వాళ్లు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు.. కారణం డబ్బు: అయ్యన్నపాత్రుడు

వాళ్లు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు.. కారణం డబ్బు: అయ్యన్నపాత్రుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని అన్నారు. చాలా కాస్ట్‌లీగా మారిపోయాయని చెప్పారు. ఆసక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్నా.. డబ్బులు లేక రాజకీయాల్లోకి రాలేక ఎంతో మంది ఊర్లలోనే మిగిలిపోతున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. బిజీ జీవితంలో పుస్తకాలు చదవడం చాలా మంది మానేస్తున్నారని పేర్కొన్నారు. నేటి తరం వారికి పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలను వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఫోన్‌కు అలవాటు పడకుండా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు పరిమితమైన పుస్తక ప్రదర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

Next Story