- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన గవర్నర్ ప్రసంగం.. ఏపీ అసెంబ్లీ వాయిదా
తొలిరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగిసింది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవ్వగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

దిశ, వెబ్‌డెస్క్: తొలిరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగిసింది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవ్వగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభం నుంచే వైసీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి.. ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి జగన్ సహా.. వైసీపీ సభ్యులంతా గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను గురించి వివరించారు. మున్ముందు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభయింది. ఈ సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలి? ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర బడ్జెట్ 2026-27పై ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. మార్చి 12వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి 7వ తేదీ వరకూ ఈ పోటీలు జరగనున్నాయి.






