- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్టుబడి దారులకు గమ్యస్థానంగా ఏపీ! మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కొరకు టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కొరకు టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మరోసారి పెట్టుబడిదారులకు గమ్యస్థానం మారుతోందని.. రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి టాటా చైర్మన్ కు వివరించామని మంత్రి లోకేష్ అన్నారు. అలాగే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు గురించి కూడా చర్చించామని తెలిపారు. దీంతో పాటు గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ లో భాగస్వామిగా టాటా అంగీకారం తెలిపినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. కాగా ఈ రోజు ఉదయమే టాటా చైర్మన్ తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడం గురించి వారితో భేటీ ఐన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పలు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.






