- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : 10వ తరగతి పరీక్ష వాయిదా... కారణం ఇదే
ఏపీ(AP)లో పదవ తరగతి పరీక్ష వాయిదా(10th Exam postponed) పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో పదవ తరగతి పరీక్ష వాయిదా(10th Exam postponed) పడింది. రంజాన్ పండగ(Ramzan festival) నేపథ్యంలో చివరి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 31న పదవ తరగతి సాంఘిక శాస్త్రం(Social Studies) పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆరోజును రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 31న జరగాల్సిన సోషల్ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షను తిరిగి మరుసటిరోజు అనగా ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కావున ఈనెల 31మా స్టోరేజి పాయింట్ల నుంచి ప్రశ్నాపత్రాలు, మెటీరియల్ ను తీసుకు వెళ్లవద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. అయితే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినప్పుడే చివరి పరీక్ష తేదీలో మార్పు ఉండవచ్చునని అధికారులు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






