కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

by Muthe.Rajitha |

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించిన సంగతి తెలిసిందే.

కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఒక్కొక్కరికి రూ.15లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో తోపులాట జరిగి.. తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు.

Next Story