- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో దారుణం.. కేసు నమోదు
పది రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్‌లో పరిచమైన విద్యార్థినిపై మరో విద్యార్థి అత్యాచారం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: పది రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్‌లో పరిచమైన విద్యార్థినిపై మరో విద్యార్థి అత్యాచారం చేశారు. ఈ ఘటన విశాఖ అవంతి ఇంజినీరింగ్ కాలేజీ(Visakhapatnam Avanti Engineering College)లో కలకలం రేపింది. అదే కాలేజీలో చదివే యవకుడు దిలీప్‌పై బీటెక్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అవంతి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న తనపై దిలీప్ అత్యాచారం చేశారని, అంతేకాకుండాన్యూడ్ వీడియోలు, ఫొటోలు తీసి గ్రూప్‌లో పెడతానని బెదిరిస్తున్నారంటూ బాధితురాలు ఆరోపించారు. తనపై అత్యాచారానికి పాల్పడిన దిలీప్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు దిలీప్‌పై భీమిలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన విశాఖ సీపీ యువకుడు దిలీప్‌పై బాధిత యువతి ఫిర్యాదు చేశారని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. దిలీప్‌ను అరెస్ట్ చేస్తామని విశాఖ సీపీ తెలిపారు.






