- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సమాధికి మరో రాయి
by Thanuru Gopichand |
ఢిల్లి ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనం అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లి ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనం అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ తో సహా ఆప్ పార్టీ ముఖ్యనాయకులను ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ఒక స్పష్టమైన తీర్పునిచ్చారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు గుణపాఠం నేర్పారని వివరించారు. కాంగ్రెస్ సమాధిపై మరో రాయిని పేర్చారని అఅన్నారు. ఢిల్లీ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






