అమరావతి అభివృద్ధికి మరో అడుగు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-10 17:22:23  IST  )

అమరావతికి అభివృద్ధికి మరో అడుగు పడింది...

అమరావతి అభివృద్ధికి మరో అడుగు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో మరో కేంద్ర ప్రభుత్వ భవనం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(Comptroller and Auditor General) భవనం నిర్మించేందుకు పరిపాలన అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) వెల్లడించారు. ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం రాజధానిలో రాష్ట్రప్రభుత్వం 2.05 ఎకరాలు కేటాయించింది. ఈ భవన నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని ఆయన తెలిపారు. అమరావతిని సమర్థవంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోది. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ భవనానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని తాను కోరారని, ఈ మేరకు పరిపాలన అనుమతులు వచ్చాయని పెమ్మసాని తెలిపారు.

Next Story