- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ జనసేనకు మరో షాక్.. కీలక నేత రాజీనామా
by GSrikanth |
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి కీలక నేతలు పార్టీని వీడి అధికార వైసీపీలో చేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి కీలక నేతలు పార్టీని వీడి అధికార వైసీపీలో చేరారు. తాజాగా అదే బాటలో మరో కీలక నేత చేరారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సాయంత్రం అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. అమలాపురం పార్లమెంట్ టికెట్ ఆశించిన ఆయన.. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన శేఖర్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి అమలాపురం పార్లమెంట్ లేదా? అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు. చివరకు నిరాశే ఎదురవడంతో పార్టీకి గుబ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారో తెలియాల్సి ఉంది.
Next Story






