బొల్లా బ్రహ్మనాయుడికి మరో షాక్... పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-15 09:24:20  IST  )

హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టాలని భావించారు...

బొల్లా బ్రహ్మనాయుడికి మరో షాక్... పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసు(Hyderabad Gandipet Land Grabing Case)లో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Ycp Former Mla Bolla Brahmanaidu)ను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టాలని భావించారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టు(Rangareddy Court)ను ఆశ్రయించారు. గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మణాయుడిని మరింతగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో మంగళవారం నుంచి బ్రహ్మనాయుడిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో బాధితుడు బొల్లా బ్రహ్మణాయుడు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం మాట్లాడి బొల్లా బ్రహ్మణాయుడిపై కేసు పెట్టించిందని వ్యాఖ్యానించారు. కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బొల్లా బ్రహ్మనాయుడు బయటకు వస్తారని వైసీపీ నేతలు దీమా వ్యక్తం చేశారు.

Next Story