- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. నేడు TDPలో చేరనున్న మర్రి రాజశేఖర్
గత సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీ (YCP)కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గత సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీ (YCP)కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ తమ పొలికల్ మైలేజీని పెంచుకునేందుకు నేతలు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలో మర్రి రాజశేఖర్ తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే గత సమావేశాల చివరి రోజు మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.






