- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూల్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. గాఢనిద్రలో ప్రయాణికులు
కర్నూల్ జిల్లాలో వీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన ఘటన జరిగిన 24 గంటల్లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో వీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన ఘటన జరిగిన 24 గంటల్లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న GEEPEE TRAVELS బస్సు కర్నూలు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.
శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కర్నూల్ లో ముందున్న వాహనాన్ని తప్పించబోయిన బస్సు.. లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగమంతా ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సును హైదరాబాద్ కు నడపడంతో ఆరాంఘర్ వద్ద ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ప్రయాణికులను అక్కడే దింపి.. బస్సుపై కేసు నమోదు చేసి, బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. కాగా.. ఈ బస్సు పెను ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడని ప్రయాణికులు చెప్తుండటం గమనార్హం.






