జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో మరొకరు మృతి

by Ajay Maddhiboyina |

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్రహీంపట్నం పర్యటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ఈ ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ కార్య‌క‌ర్త రాంబాబు గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో మరొకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్రహీంపట్నం పర్యటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ఈ ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ కార్య‌క‌ర్త రాంబాబు గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా మ‌రో యువ‌కుడు బైక్ స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్ గేట్ ను గుద్దుకుని మృతి చెందాడు. మృతి చెందిన వ్య‌క్తిని భార్గ‌వ్ గా గుర్తించారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఇబ్ర‌హీంప‌ట్నంకు వెళ్లారు. అక్క‌డ వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. అయితే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ప‌ర్మిష‌న్ లేద‌ని పోలీసులు చెబుతున్నారు. పరామ‌ర్శ‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తుండ‌టంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, సామాన్యులు ఇబ్బుందులు ఎదుర్కొంటున్నార‌ని పోలీసులు ఓ నోట్ కూడా విడుద‌ల చేశారు. వైసీపీ ముందుగానే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న రూట్ మ్యాప్ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో పోలీసులు ఈ నోట్ రిలీజ్ చేశారు.

Next Story