- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీలో మరో కొత్త వివాదం.. సభ్యుడి కుటుంబంపై మత మార్పిడి ఆరోపణలు
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో మరో కొత్త వివాదం రాజుకుంది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి(Tirumala Tirupati Devastanam)లో మరో కొత్త వివాదం రాజుకుంది. బోర్డు సభ్యుడు ఆర్.ఎన్. దర్శన్(Board Member R.N. Darshan) కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి(Thirukshetra Protection Committee) సంచలన ఆరోపణలు చేసింది. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల పాలకమండలి(Tirumala Governing Council)లో అన్యమతస్థులు కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని సమితి ప్రతినిధులు మండిపడుతున్నారు దర్శన్ భార్య గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను రక్షణ సమితి బహిర్గతం చేశారు.
ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తక్షణమే స్పందించాలని, దర్శన్‌ను బోర్డు నుంచి తొలగించాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి(Thirukshetra Protection Committee) ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం బోర్డు సభ్యులుగా ఉండేవారు తప్పనిసరిగా హిందూ మతావలంబీకులై ఉండాలని.. అధికార యంత్రాంగం ఈ ఆరోపణలపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు చర్చి ప్రార్థనల్లో దర్శన్ కుటుంబం పాల్గొన్నట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరమ పవిత్రమైన టీటీడీ బోర్డులో హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి చోటు కల్పించడం ఏంటని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు






