- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీని వీడని వర్షాలు.. రేపు మరో అల్పపీడనం
ఒక అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సతమతమవుతున్న ఏపీ ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ పిడుగులాంటి వార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు (Heavy Rains) నీడలా వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంటపొలాల్లోకి నీరు చేరడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. పొలాల్లోని నీటిని మోటార్ల సాయంతో తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో నెలరోజుల్లో పంట చేతికి వస్తుందనగా ఇలా పంట వర్షార్పణం అవుతుందని వాపోతున్నారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం (Severe Low Pressure) తీరందాటి బలహీనపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఒక అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సతమతమవుతున్న ఏపీ ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ పిడుగులాంటి వార్త చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. తదుపరి 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ - ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






