- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్షసూచన
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ - పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు (జూన్ 29) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు, మిగతాజిల్లాల్లో చెదరమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే రానున్న కాకినాడ, ఏలూరు, కృష్ణా, విజయవాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో జూలై 2వ తేదీ వరకూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story






