ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది.

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి తవ్వి తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన డీసిల్టేషన్‌కు రూ.286 కోట్లు ఇచ్చేందుకు కావలసిన అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. టెండర్ల బాధ్యతలను జల వనరుల శాఖ, పర్యవేక్షణను CRDAకు అప్పగించింది. అన్ని అనుమతులు, నిబంధనల మేరకు మాత్రమే ఇసుకను తవ్వాలని ప్రభుత్వం CRDAను ఆదేశించింది. మరోవవూపు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా తగ్గడంతో ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు.

Next Story