- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Liquor Scam: మరో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్టు
ఏపీ మద్యం కుంభకోణం కేసు లో సిట్ దూకుడు పెంచింది. మరో కీలక నిందితుడిని ఈ రోజు అరెస్టు చేసింది.

నిందితుడు భారతి సిమెంట్స్‌లో డైరెక్టర్
మైసూర్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలింపు..
మద్యం కుంభకోణం రోజుకో మలుపు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ మద్యం కుంభకోణం కేసు లో సిట్ (SIT) దూకుడు పెంచింది. మరో కీలక నిందితుడిని ఈ రోజు అరెస్టు చేసింది. గోవిందప్ప బాలాజీని సిట్అధికారులు ఈ ఉదయం మైసూరులో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్టు అయ్యారు. పక్కా సమాచారం మేరకు గోవిందప్ప బాలాజీపై సిట్నిఘా వేసింది. అతనిని మైసూరు నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉంది. బాలాజీ భారతి సిమెంట్స్ లో డైరెక్టర్‌గా పని చేశారు. నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఆదివారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వారు రాలేదు. హైదరాబాద్, విజయవాడలోని వారి నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరు ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరనేది తెలుస్తుందని సిట్ భావిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తున్నకేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ నిన్న లేఖ రాసింది.
నిందితులను విచారించడానికి విజయవాడ సీపీ అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ తో (FIR) పాటు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలుతో అరెస్టు చేసిన వారి డీటైల్స్.. దర్యాప్తులో తేలిన నగదు లావాదేవీల వివరాలుతో సహా మొత్తం వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఇదే కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి (Midhunreddy) సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంతో తమకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిధున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు.






